• Contact Us
Thursday, February 19, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!

admin by admin
February 19, 2026
in ఆరోగ్యం
Reading Time: 1 min read
0
ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!

Related Post

మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది

ఒత్తిడికి యోగాతో చెక్ – ఆరోగ్యాన్ని పంచుతున్న ‘ఏ4 యోగా స్టూడియో’

ఆరోగ్యమే అసలు సంపద: డా. శ్రీలక్ష్మి కొత్త సేవలతో మీ దగ్గరకు!

కంగెన్ వాటర్‌తో ఆరోగ్య జీవనం..

  • బుధవారం వర్చువల్ గా లాంఛ్
  • వైద్య రంగ నూతన ఆవిష్కరణల్లో మెధాజెన్ కీలక పాత్ర
  • ఆరోగ్య నిపుణులు, విద్యార్థుల నుంచి విశేష స్పందన

    హైదరాబాద్, ఫిబ్రవరి 18, 2026: ప్రస్తుత సాంకేతిక ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శాసిస్తోంది. ఏఐ ప్రతి రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య రంగంలో కూడా కృత్రిమ మేధ విప్లవానికి శ్రీకారం చుట్టింది మెధాజెన్ ఏఐ.

    భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైద్యం, ఆరోగ్య వ్యవస్థల్లో ఏఐ వినియోగాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో ‘మెధాజెన్ ఏఐ’ ఆవిష్కృతమైంది. బుధవారం ఈ మెధాజెన్ ఏఐ ను వర్చువల్ గా అధికారికంగా ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, ఆరోగ్య నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొని ఆరోగ్యరంగంలో ఏఐ ఆధారిత మార్పుకు మద్దతు తెలిపారు.

    ఈ సందర్భంగా మెధాజెన్ ఏఐ సీఈవో డా. భరత్ కుమార్ కక్కిరేణి మాట్లాడుతూ ఆరోగ్యం రంగంలో మెధాజెన్ ఏఐ దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రయోజనాలను వివరించారు. ఈ ఏఐ ద్వారా ఆసుపత్రులను ఇంటలీజెంట్, డేటా ఆధారిత ఆరోగ్య ఎకోసిస్టంలుగా మార్చాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. క్లినికల్ నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం, ఆసుపత్రి పనితీరును మెరుగుపరచడం, పరీక్షలో కచ్చితమైన నిర్ధారణ, మెరుగైన ఫలితాల కోసం ఏఐ కీలకమని అభిప్రాయపడ్దారు. ఏఐ నైతికత, డేటా గోప్యత, వివరణాత్మక పద్దతుల ద్వారా వైద్యుల నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని భరత్ కుమార్ ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త సమీర్ సలీబా మాట్లాడుతూ “వాస్తవ ప్రపంచంలో ఆరోగ్య రంగంపై ఏఐ వినియోగం” అనే అంశంపై ప్రసంగించారు. ఈ ఏఐ ద్వారా నియంత్రణ నిబంధనలు, ఆసుపత్రి వ్యవస్థలతో అనుసంధానం, వైద్యుల ఆమోదం, విస్తృత స్థాయి అమలు వ్యూహాలు వంటి అంశాలను ఆయన వివరించారు.

    ముఖ్య అతిథిగా మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ కుమార్ యాట మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో కృతిమ మేధ పాత్రను వివరించారు. ఇమేజింగ్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, ఓమిక్స్ డేటా ద్వారా ప్రిసిషన్ మెడిసిన్ సాధ్యమని చెప్పారు.

    మేధాజెన్ ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిరామ్ రెడ్డి మాట్లాడుతూ వైద్యం, ఆరోగ్య సంరక్షణలో సహకారాన్ని పెంపొందించడానికి మేధాజెన్ AI నిబద్ధతను వివరించారు.
    మెధాజెన్ ఏఐ వైద్య రంగంలో ఆవిష్కరణలు, సామర్థ్యం పెంపు, వాస్తవ పరిస్థితుల్లో మెడికల్ ఏఐ పరిష్కారాల అమలుకు ఒక సమిష్టి వేదికగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, ప్రిడిక్టివ్ మరియు ప్రివెంటివ్ హెల్త్ అనలిటిక్స్, డిజిటల్ హాస్పిటల్ రూపాంతరం, స్టార్టప్ ఇన్క్యూబేషన్, విద్యార్థులు మరియు ఆరోగ్య నిపుణులకు ప్రాయోగిక శిక్షణ కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది.

    ఈ మెధాజెన్ ఏఐ ఆవిష్కరణ కార్యక్రమానికి వైద్యులు, పరిశోధకులు, విద్యార్థులు, స్టార్టప్ ఎంట్రప్రెన్యూర్స్ నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ఏఐ యుగంలో మెధాజెన్ ఏఐ స్మార్ట్ ఆసుపత్రుల నిర్మాణానికి, ఆరోగ్య నిపుణుల సాధికారతకు, డేటా ఆధారిత, రోగి కేంద్రిత వైద్య భవిష్యత్తు రూపకల్పనకు బలమైన పునాది వేసింది.
Share212Tweet133SendSend

Related Posts

మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది
తెలంగాణ

మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది

🌟 మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించిందిహైదరాబాద్, నవంబర్ 1: మనసు యొక్క శక్తిని అవగతం...

by admin
November 1, 2025
ఒత్తిడికి యోగాతో చెక్ – ఆరోగ్యాన్ని పంచుతున్న ‘ఏ4 యోగా స్టూడియో’
ఆరోగ్యం

ఒత్తిడికి యోగాతో చెక్ – ఆరోగ్యాన్ని పంచుతున్న ‘ఏ4 యోగా స్టూడియో’

హైదరాబాద్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెరిగిపోతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు పురాతన యోగా శాస్త్రంతో పరిష్కారం చూపుతోంది 'ఏ4 యోగా స్టూడియో'. అంతర్జాతీయ యోగా శిక్షకుల...

by Telugu World
July 17, 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!

ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!

February 19, 2026
తెలంగాణ లోక్ భవన్‌లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

తెలంగాణ లోక్ భవన్‌లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

January 28, 2026
యూనిప్రో సీఈవోగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్!

యూనిప్రో సీఈవోగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్!

December 1, 2025
మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది

మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది

November 1, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.