హైదరాబాద్, కుకట్‌పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రామక్రిష్ణ తాప్రె ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని రామక్రిష్ణ తాప్రెకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా రామక్రిష్ణ తాప్రె మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1వ తారీఖున మొదలవ్వనుంది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో AI విప్లవం.. దేశంలోనే తొలి AI ఆధారిత పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు!
ఫిర్యాదుల నమోదు నుంచి ఛార్జిషీట్ల తయారీ వరకు.. పోలీసింగ్ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్: టెక్నాలజీ రంగంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా...



