హైదరాబాద్, నాచారంకు చెందిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కలకంటి సునీత సందీప్ ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని కలకంటి సునీత సందీప్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా కలకంటి సునీత సందీప్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో నా విధుల్లో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1వ తారీఖున మొదలవ్వనుంది.