హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అన్నపురెడ్డి శ్రీలక్ష్మి ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా అన్నపురెడ్డి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో ఒక కొత్త దిశను చూపించింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారంలో కొత్త ఆవిష్కరణలు, మార్కెటింగ్ వ్యూహాలు, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో దోహదం చేస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు. తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 1, 2025న ప్రారంభం కానుంది.