• Contact Us
Tuesday, July 1, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Chiranjeevi: యూకే పార్లమెంట్‌లో సత్కారం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Telugu World by Telugu World
March 20, 2025
in టాలీవుడ్
Reading Time: 1 min read
0
Chiranjeevi: యూకే పార్లమెంట్‌లో సత్కారం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Related Post

Synthesia.ai: వీడియో తయారీని మార్చేస్తున్న ఆధునిక AI టూల్

రియలెస్టేట్ రంగంలో తిరుగులేని విజయాలను సాధిస్తున్నాను తెలుగు AI బూట్ క్యాంప్ అందించిన జ్ఞానం వల్లే ఇదంతా సాధ్యమయింది.

ఓదెల 2 మూవీ రివ్యూ: తమన్నా అద్భుత నటన, కానీ మిశ్రమ స్పందన – రేటింగ్ 3.5/5! 

ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉంది – ఉపాసన కొణిదెల

టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవిని యూకే పార్లమెంట్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లో ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డును అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్‌ పార్లమెంటులో తనకు దక్కిన గౌరవంపై తాజాగా చిరంజీవి స్పందించారు.


”UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు ఇచ్చిన గౌరవానికి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. టీమ్ బ్రిడ్జ్ ఇండియా అందించిన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాను. మాటలు సరిపోవు. నా ప్రయాణానికి అన్ని విధాలుగా సహకరించిన నా అభిమానులు, రక్త సంబంధీకులు, నా సినిమా ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నేను చేస్తున్న మానవతావాద కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నన్ను మరింత శక్తితో పని చేయడానికి ప్రేరేపిస్తుంది” అని చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.


అలానే చిరంజీవి మరో ట్వీట్ చేస్తూ యూకే పార్లమెంట్‌లో జీవిత సాఫల్య పురస్కారం అందించడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా బ్రిటన్‌ పార్లమెంటులో సత్కారానికి సంబంధించిన ఫోటోలు, అక్కడి ప్రతినిధులతో దిగిన ఫోటోలను కూడా ఎక్స్ లో షేర్ చేసారు. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరుకి దక్కిన ఈ గౌరవానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఇంకా మరెన్నో అవార్డులు సాధించాలని కోరుకుంటున్నారు.
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి.. తన స్వయంకృషితో ఇండియన్ సినిమాలో హిస్టరీ క్రియేట్ చేసాడు. నాలుగున్నర దశాబ్దాల తన కెరీర్ లో 156 సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. 9 ఫిలింఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులతోపాటు రఘుపతి వెంకయ్య పురషారాన్ని సాధించారు. కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌, 2024లో దేశంలో రెండో అత్యున్నతమైన పద్మ విభూషణ్‌ పురష్కారంతో సత్కరించింది. తన డ్యాన్సులతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కిన చిరు.. గతేడాది ANR నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల చిత్రాలు లైన్ లో ఉన్నాయి.

Share214Tweet134SendSend

Related Posts

Synthesia.ai: వీడియో తయారీని మార్చేస్తున్న ఆధునిక AI టూల్
టాలీవుడ్

Synthesia.ai: వీడియో తయారీని మార్చేస్తున్న ఆధునిక AI టూల్

ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్, మార్కెటింగ్, ట్రైనింగ్ రంగాల్లో వీడియో తయారీకి కొత్త దిశను చూపుతున్న Synthesia.ai ఇప్పుడు AI టెక్నాలజీలో హాట్ టాపిక్‌గా మారింది. లండన్‌లో 2017లో స్థాపితమైన...

by Telugu World
June 19, 2025
రియలెస్టేట్ రంగంలో తిరుగులేని విజయాలను సాధిస్తున్నాను తెలుగు AI బూట్ క్యాంప్ అందించిన జ్ఞానం వల్లే ఇదంతా సాధ్యమయింది.
ఆంధ్రప్రదేశ్

రియలెస్టేట్ రంగంలో తిరుగులేని విజయాలను సాధిస్తున్నాను తెలుగు AI బూట్ క్యాంప్ అందించిన జ్ఞానం వల్లే ఇదంతా సాధ్యమయింది.

రాజమండ్రికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సేల్స్ & మార్కెటింగ్ నిపుణుడు, కుమారి ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ తమ్మన నాగేశ్వర రావు, నికీలు గుండ గారి నేతృత్వంలో...

by Telugu World
June 26, 2025
Next Post
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఘనంగా ప్రారంభం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఘనంగా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

June 30, 2025
లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

June 30, 2025
కేవలం 50 రోజుల్లో AI నిపుణులుగా మారండి – తెలుగు భాషలోనే ప్రత్యేకమైన బూట్ క్యాంప్!

కేవలం 50 రోజుల్లో AI నిపుణులుగా మారండి – తెలుగు భాషలోనే ప్రత్యేకమైన బూట్ క్యాంప్!

June 26, 2025
తెలుగు AI బూట్ క్యాంప్ – 50 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకునే అరుదైన అవకాశం

తెలుగు AI బూట్ క్యాంప్ – 50 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకునే అరుదైన అవకాశం

June 26, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.