హైదరాబాద్, ఏప్రిల్ 14, 2025 – జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి, ఈ రోజు హైదరాబాద్‌లో టి హోమ్స్ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా 150 మంది బృందాన్ని నడిపిస్తున్న ప్రేమ్‌చంద్ పులిగిల్ల జీవితం ఒక స్ఫూర్తి కథ. విద్య, కష్టపడి పనిచేయడం, సమాజ సేవలో తనదైన ముద్ర వేస్తూ, ఆయన ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రేమ్‌చంద్ విద్యా ప్రస్థానం B.Sc (Bt.Zc), M.Sc (ఆర్గానిక్ కెమిస్ట్రీ)తో ప్రారంభమైంది. మొదట జూనియర్ లెక్చరర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన, తర్వాత GVK Bio Sciences, Bharat Biotech సంస్థల్లో ఏడేళ్లపాటు కెమిస్ట్‌గా పనిచేసి విలువైన అనుభవం సంపాదించారు. కుటుంబం కోసం మూడేళ్ల విరామం తీసుకుని, తన కుమారుని పెంపకంపై దృష్టి సారించిన ఆయన, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. టి హోమ్స్ ఇన్ఫ్రాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, నాయకత్వంలో తన సత్తా చాటుతున్నారు.
రియల్ ఎస్టేట్‌తో పాటు, ప్రేమ్‌చంద్ సామాజిక సేవలోనూ ముందుంటారు. NLP కోర్, IMPACT ట్రైనర్ సర్టిఫికెట్లు సాధించిన ఆయన, రియల్ ఎస్టేట్ శిక్షణ ద్వారా ఎందరికో మార్గదర్శనం అందిస్తున్నారు. జేసీఐ, లయన్స్ క్లబ్ సభ్యుడిగా, టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా కూడా సేవలు అందిస్తూ, “ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే నా లక్ష్యం,” అని చెబుతున్నారు. “మాటలకన్నా మార్పు ముఖ్యం,” అనే ఆయన సందేశం ఎందరినో ఆలోచింపజేస్తోంది.