బాపట్ల టౌన్‌కు చెందిన ఇన్సూరెన్స్ అడ్వైసర్ జయం వరబాబు, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని జయం వరబాబుకు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
జయం వరబాబు మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నాకు టెక్నాలజీపై కొత్త అవగాహనను కలిగించింది. నేను గత 10 సంవత్సరాలుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్సు రంగాల్లో పని చేస్తున్నాను. ఈ బూట్ క్యాంప్ ద్వారా AI టూల్స్‌ను నేర్చుకుని నా ప్రొఫెషనల్ కెరీర్‌ను మరింత మెరుగుపరచుకునే అవకాశం లభించింది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, మెంటర్ నికీలు గుండా కు హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.