ప్రముఖ యువ వ్యాపార వేత్త, ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ మెంబర్, కేబీకే గ్రూప్ అధినేత డాక్టర్ భరత్ కుమార్ కక్కిరేణి మరో కీలక బాధ్యతలు చేపట్టారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో లిస్టింగ్ పొందిన యూనిప్రో టెక్నాలజీస్ లిమిటెడ్ అడిషనల్ డైరెక్టర్ కమ్ సీఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు యూనిప్రో టెక్నాలజీస్ లిమిటెడ్ సీఈవోగా డా. భరత్ కుమార్ నియామకాన్ని బీఎస్ఈ ఇండియా ధ్రువీకరించింది. 1985లో స్థాపితమైన యునిప్రో టెక్నాలజీస్ లిమిటెడ్ IT సర్వీసులు, అప్లికేషన్ డెవలప్మెంట్, BPO సర్వీసులు, డేటాబేస్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో సేవలు అందిస్తూ వచ్చింది. కాగా ఇటీవల ఇటీవల తన వ్యాపార దిశను మార్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఉత్పత్తులు, డిజిటల్ సొల్యూషన్లపై యూనిప్రో దృష్టి సారించింది. సంస్థ భవిష్యత్‌లో రీసెర్చ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఆటోమేషన్ ఆధారిత టెక్నాలజీ సొల్యూషన్ల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టిపెట్టనుంది. ప్రస్తుతం యూనిప్రో మైక్రో-క్యాప్ స్థాయి మార్కెట్ విలువ కలిగి ఉన్నప్పటికీ, AI వైపు దృష్టి సారించడంతో సంస్థలో వృద్ధి అవకాశాలను సూచిస్తోంది. కొత్త AI ఉత్పత్తులు, వ్యాపార ఒప్పందాలు, రెవెన్యూ ప్రభావం తదితర అంశాలపై కంపెనీ నుంచి రాబోయే సమాచారాన్ని మార్కెట్ ఆసక్తిగా గమనిస్తోంది.
మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది
🌟 మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించిందిహైదరాబాద్, నవంబర్ 1: మనసు యొక్క శక్తిని అవగతం...






