యూనివర్సల్ హోమియోపతి వ్యవస్థాపకులు మరియు వైద్యులుగా విజయవంతంగా కొనసాగుతున్న శేర్ లింగంపల్లికి చెందిన నీలం గౌరీశంకర్, ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని నీలం గౌరీశంకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా నీలం గౌరీశంకర్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా హోమియోపతి సేవలలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
ఉదయం మారితే జీవితం మారుతుంది… వందలాది మహిళలకు కొత్త దిశ చూపుతున్న “బ్రహ్మ ముహూర్త హబ్” వ్యవస్థాపకురాలు సుమిత్ర కుంచే.
ప్రత్యేక కథనం "ఒక ప్రశాంతమైన తల్లి... ఒక ఆనందకరమైన కుటుంబానికి మాత్రమే కాదు, ఒక బలమైన భవిష్యత్తుకు కూడా పునాది వేస్తుంది. అలాంటి కుటుంబాలే మార్పుకు, మానవత్వానికి,...







