ప్రగతి రత్న అవార్డ్స్ 2026కు సర్వం సిద్ధం.. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఘనంగా వేడుక
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు ప్రగతి రత్న అవార్డ్స్ 2026 వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యునిక్ లైఫ్ గ్రూప్స్ సమర్పణలో, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ వేణు కళ్యాణ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 25న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
విజయవంతమైన వ్యాపారాలను నిర్మిస్తూ, వినూత్న ఆలోచనలతో తమ రంగాల్లో ముందుకు సాగుతున్న పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, మహిళా నాయకులు, డిజిటల్ క్రియేటర్లకు గుర్తింపు కల్పించడం ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం. వ్యాపార అభివృద్ధితో పాటు సమాజానికి సేవ చేస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించే వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ముఖ్య అతిథిగా సినీ నటి శ్రియా సరన్
అక్టోబర్ 25, ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని బండ్లగూడ, విజయ గార్డెన్స్ సమీపంలోని PBR కన్వెన్షన్ హాల్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుంది. ప్రముఖ సినీ నటి శ్రియా సరన్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఏడు విభాగాల్లో అవార్డులు
ప్రగతి రత్న అవార్డ్స్ 2026లో మొత్తం ఏడు ప్రధాన విభాగాలను ఏర్పాటు చేశారు. MSME బిజినెస్ ఎక్సలెన్స్, ఉమెన్ లీడర్‌షిప్, హెల్త్‌కేర్ అండ్ వెల్‌నెస్ ఎక్సలెన్స్, ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్, డిజిటల్ క్రియేటర్స్ ఎక్సలెన్స్, గ్లోబల్ గ్రీన్ ఎక్సలెన్స్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ విభాగాల్లో ప్రతిభావంతులను గుర్తించి సత్కరించనున్నారు.
చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల నుంచి కొత్తగా ఎదుగుతున్న స్టార్టప్‌ల వరకు వివిధ రంగాలకు చెందిన అర్హులైన వ్యక్తులు, సంస్థలు తమ విజయాలను నామినేషన్ల ద్వారా వివరించే అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వైద్య రంగ నిపుణులు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు ఈ అవార్డులు ప్రోత్సాహకరంగా నిలవనున్నాయి.
నామినేషన్లకు అవకాశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అర్హులైన సంస్థలు, నిపుణులు నామినేషన్లు సమర్పించవచ్చు. జ్యూరీ బృందం ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన విజేతలను ఎంపిక చేయనుంది.
విజేతలకు ప్రత్యేక గుర్తింపు
అవార్డు విజేతలకు ట్రోఫీ, సర్టిఫికేట్‌తో పాటు రెడ్ కార్పెట్ స్వాగతం, ఎల్‌ఈడీ తెరపై వారి పేరు, ఫొటో, సంస్థ లోగో ప్రదర్శన వంటి ప్రత్యేక గుర్తింపులు కల్పిస్తామని, అలాగే 50కి పైగా డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌లో మీడియా కవరేజ్, సోషల్ మీడియా ప్రమోషన్, ప్రొఫెషనల్ వీడియో రీల్స్ ద్వారా విజేతల విజయాలను ప్రజలకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం, వ్యాపారవేత్తల విజయగాథలను వెలుగులోకి తీసుకురావడం, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ప్రగతి రత్న అవార్డ్స్ 2026ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమ వివరాలు: ప్రగతి రత్న అవార్డ్స్ 2026 | అక్టోబర్ 25, 2026 | సాయంత్రం 5 గంటల నుంచి | PBR కన్వెన్షన్ హాల్, బండ్లగూడ, హైదరాబాద్






