మణికొండ, పుప్పాలగూడాకు చెందిన రత్నమాల పచ్చారి, రేకీ హీలర్ (వైద్య విధానం) & కోచింగ్‌లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని రత్నమాల పచ్చారికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా రత్నమాల పచ్చారి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వ్యాపార, వృత్తి జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వ్యాపారంలో సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని ధీమాగా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
యూనిప్రో సీఈవోగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్!
ప్రముఖ యువ వ్యాపార వేత్త, ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ మెంబర్, కేబీకే గ్రూప్ అధినేత డాక్టర్ భరత్ కుమార్ కక్కిరేణి మరో కీలక బాధ్యతలు చేపట్టారు. బాంబే...







