Stock Market: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఫైనాన్షియల్ మార్కెట్లు గజగజ వణికిపోతున్నాయి. తాము విధించే సుంకాలు పెరగవచ్చని ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
మరోవైపు అమెరికా ఆర్థికమాంద్య భయాలను పట్టించుకోనంటున్నారు ట్రంప్. అంతేకాదు ట్రంప్ షట్డౌన్ భయాల ను కొట్టిపారేశారు. మరోవైపు నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టం 23వేల 350 పాయింట్ల దిగువన నిఫ్టీ ట్రేడింగ్ అవుతోంది.