వాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్, త్వరలో అండ్రాయిడ్ ఫోన్ల కోసం మోషన్ ఫోటోస్ షేర్ చేసే సౌకర్యాన్ని అందించబోతోంది. ఇప్పటి వరకు మోషన్ ఫోటోస్ అనే ప్రత్యేకమైన ఫార్మాట్ – అంటే ఒక ఫోటో తీసే సమయంలో ఆ ఫోటోకు ముందు, తర్వాత కొన్ని క్షణాల వీడియోను కూడా క్యాప్చర్ చేసే విధానం – వాట్సాప్ లో పంపినప్పుడు సాధారణ స్టిల్ ఫోటోగా మారిపోయేది. దీని వల్ల ఆ ఫోటోలో ఉన్న లైవ్ ఎఫెక్ట్ పూర్తిగా నశించిపోతుండేది.

ఇప్పుడు వాట్సాప్ ఈ ఫీచర్‌పై పని చేస్తోంది. త్వరలోనే మోషన్ ఫోటోస్ వినియోగదారులు మోషన్ ఫోటోస్ ను అదే లైవ్ ఎఫెక్ట్‌తో పంపే అవకాశం పొందబోతున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది, మొదటగా బీటా వర్షన్‌లో టెస్ట్ చేయబడే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఇది అధికారికంగా అందరికి రోల్‌ఔట్ కానుంది. ఇదొక చిన్న అప్డేట్ లాగే అనిపించవచ్చు, కానీ ఫోటోల ద్వారా ఎమోషన్‌ని పంచుకోవాలనుకునే యూజర్లకు ఇది తప్పకుండా ఉపయోగపడే ఫీచర్.