హబ్సిగూడ, హైదరాబాద్ కు చెందిన బిజినెస్ కన్సల్టెంట్ అయిన విజయేందర్ రెడ్డి పిట్ట, ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న, T-Hub, హైదరాబాద్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వర్ రావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని విజయేందర్ రెడ్డి పిట్టకు పట్టా అందజేశారు.
ఈ 21-రోజుల బూట్ క్యాంప్‌లో AI టూల్స్, వ్యాపార అభివృద్ధి, క్రియేటివ్ డిజైన్, వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ వంటి అంశాల్లో లోతుగా శిక్షణ పొందారు.
AI బూట్ క్యాంప్ అనుభవాన్ని పంచుకుంటూ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, “AI టాపిక్స్ నాకు 99% కొత్త. 20 ఏళ్ల వ్యాపార అనుభవం ఉన్నా, ఈ సెషన్స్‌లో 50% వరకు కొత్త వ్యూహాలు నేర్చుకున్నాను. నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, శ్రీచరణ్ లక్కరాజు వంటి స్పీకర్లు ఎంతో విలువైన సూచనలు ఇచ్చారు,” అని తెలిపారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది.