హైదరాబాద్, ఫీచర్స్ డెస్క్: చిన్ననాటి అభిరుచే ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. బొమ్మల సేకరణపై ఉన్న ఇష్టం, ఇప్పుడు ఎందరో కళాకారులకు ఉపాధినిచ్చే ఒక వేదికకు ఊపిరిపోసింది. అలా మోనికా కారుమూరి ఆలోచనల్లో నుంచి రూపుదిద్దుకున్నదే ‘శ్రీఆర్ట్‌కృతి – హౌజ్ ఆఫ్ ఆర్ట్’. సంప్రదాయ కళారూపాలను నేటి తరానికి చేరువ చేసే ఒక అందమైన ప్రయత్నమిది.

కళాఖండాల నిలయం శ్రీఆర్ట్‌కృతి సంప్రదాయ హస్తకళలకు చిరునామాగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ కొండపల్లి బొమ్మలు, ప్రకృతి సిద్ధమైన రంగులతో రూపుదిద్దుకునే ఏటికొప్పాక చెక్క బొమ్మలతో పాటు, మనసును దోచే మరెన్నో హస్తనిర్మిత కళాఖండాలు ఇక్కడ కొలువుదీరాయి. బహుమతులుగా ఇవ్వడానికైనా, ఇంటి అలంకరణకైనా సరిపోయే ప్రత్యేకమైన ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఉత్పత్తిలోనూ దేశీ కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకత ఉట్టిపడతాయి.
ప్రేమతో ప్రోత్సాహం ‘హస్తకళతో, ప్రేమతో’ (హ్యాండ్‌క్రాఫ్టెడ్ విత్ లవ్) అనే నినాదంతో ఈ సంస్థ పనిచేస్తోంది. కేవలం వ్యాపారమే లక్ష్యంగా కాకుండా, అంతరించిపోతున్న దేశీ కళారూపాలను ప్రోత్సహించడం, వాటిపై ఆధారపడిన కళాకారుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం కూడా తమ బాధ్యతగా మోనికా భావిస్తున్నారు. తన వ్యాపారం ద్వారా కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆమె తోడ్పాటునందిస్తున్నారు.
సమాచారం కోసం.. ఈ అద్భుతమైన కళాఖండాలను వీక్షించాలనుకునేవారు, కొనుగోలు చేయాలనుకునేవారు శ్రీఆర్ట్‌కృతి ఇన్‌స్టాగ్రామ్ (@sriartkriti), ఫేస్‌బుక్ పేజీల ద్వారా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం వ్యవస్థాపకురాలు మోనికా కారుమూరిని 94925 65904 నంబరులో వాట్సప్ ద్వారా సంప్రదించాలని నిర్వాహకులు
సూచించారు.