ఒకవైపు ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, మరోవైపు ఎల్‌ఐసి ఆర్థిక సలహాదారుగా వందలాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తూ, రెండు విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన శ్రీ పుట్ట గణేశ్ రాజు. MSc, B.Ed విద్యార్హతలతో ఆయన అందిస్తున్న బహుముఖ సేవలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఆయన నిబద్ధత, నిష్పాక్షపాత సేవా దృక్పథానికి గుర్తింపుగా, పలువురు ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ రచయిత శ్రీ యందమూరి వీరేంద్రనాథ్, సాహితీ శిఖరం శ్రీ గరికపాటి నరసింహారావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ గంపా నాగేశ్వరరావు వంటి దిగ్గజాలు వివిధ సందర్భాల్లో గణేశ్ రాజు గారిని సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు.
ఆయన తన వృత్తిపరమైన తత్వాన్ని ఇలా వివరిస్తారు:
“నేను పాలసీలు అమ్మను… నమ్మకాన్ని నిర్మిస్తాను, కలలను కాపాడుతాను, జీవితాలను భద్రపరుస్తాను.”
ఈ మాటలు అక్షరాలా పాటిస్తూ, ప్రతి ఖాతాదారుడి అవసరాలను అర్థం చేసుకొని, వారికి అత్యుత్తమమైన సేవలను అందించడం ఆయన ప్రత్యేకత. ఉపాధ్యాయుడిగా, ఆర్థిక సలహాదారుడిగా ఆయన అందిస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఆర్థిక భద్రత, భీమా సలహాల కోసం ఆయనను 9000986586 నంబరులో సంప్రదించవచ్చు.