పుట్టిన ఊరు, పెరిగిన సమాజం రుణం తీర్చుకోవాలనే తపనతో, ఉన్నత చదువులు చదివి, నేడు సామాజిక సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని సంకల్పించారు సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం, మంసంపల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీ సురేష్ గోంగా. విద్య, కృషి, సేవా తత్వాలను పుణికిపుచ్చుకొని, ఆయన సాగిస్తున్న ప్రయాణం, గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
కుటుంబమే బలమైన పునాది..
1994లో మంసంపల్లి గ్రామంలో జన్మించిన సురేష్, జోగిపేటలోని స్వామి వివేకానంద పాఠశాలలో ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో B.Sc, ఆ తర్వాత డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుంచి M.Sc (సైకాలజీ) పూర్తి చేశారు. తన ఈ విద్యా ప్రస్థానానికి, తన అన్నయ్యలు, అక్క, తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహమే కారణమని ఆయన వినమ్రంగా చెబుతారు. వారి పెంపకంలో నేర్చుకున్న విలువలే, తనను సమాజ సేవ వైపు నడిపించాయని అంటారు.
వృత్తిలో రాణిస్తూ.. సేవ వైపు అడుగులు..
విద్యాభ్యాసం పూర్తయ్యాక, ‘కన్‌స్ట్రక్షన్ సొల్యూషన్స్’ రంగంలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సురేష్, తన నిబద్ధత, కష్టపడే తత్వంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, వ్యక్తిగత ఎదుగుదల కన్నా, సమాజానికి ఉపయోగపడటమే నిజమైన విజయమని ఆయన బలంగా నమ్ముతారు.
“నన్ను పెంచిన ఈ మట్టి, నాకు బలం ఇచ్చిన నా కుటుంబం.. వీరే నా పునాదులు. నా శక్తి మొత్తాన్ని సమాజానికి ఉపయుక్తంగా మార్చాలన్నదే నా లక్ష్యం. నా హృదయం ఎప్పుడూ ప్రజల పట్ల, గ్రామాల పట్ల, దేశం పట్ల ఉంటుంది,” అని సురేష్ గారు తన ఆశయాన్ని వివరిస్తారు.
ఈ సంకల్పంతోనే, ఆయన భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, మానసిక వికాసం వంటి రంగాల్లో ప్రజలతో కలిసి పనిచేయాలని, యువతలో సానుకూల మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సంప్రదించండి:
సురేష్ గోంగా
మంసంపల్లి గ్రామం, ఆందోల్ మండలం,
సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
ఫోన్: 9652081463