తెలంగాణ, కరీంనగర్‌కు చెందిన పశువైద్యుడు తిరునగరి ప్రణయ్ కుమార్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని తిరునగరి ప్రణయ్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా పశువైద్య సేవల కార్యకలాపాలలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.
యూనిప్రో సీఈవోగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్!
ప్రముఖ యువ వ్యాపార వేత్త, ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ మెంబర్, కేబీకే గ్రూప్ అధినేత డాక్టర్ భరత్ కుమార్ కక్కిరేణి మరో కీలక బాధ్యతలు చేపట్టారు. బాంబే...







