• Contact Us
Sunday, September 20, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Vande Bharat Sleeper Train రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. త్వరలో ఈ రూట్లలో ప్రారంభం..

Telugu World by Telugu World
March 20, 2025
in ప్రయాణం
Reading Time: 1 min read
0

Vande Bharat Sleeper Train ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై విజయవంతంగా, వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆధునీకరించబడిన వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో అనేక స్లీపర్ ట్రైన్స్ ఒకేసారి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. దేశంలో సుమారు 200 వందే భారత్ స్లీపర్ రైళ్లను భారతీయ రైల్వే యోచిస్తోంది. ఇందులో ఎక్కువ వందే భారత్ రైళ్లు మధ్యప్రదేశ్‌లోని ప్రధాన మార్గాల్లో నడవనున్నాయి. ప్రస్తుతం 10 వందే భారత్ స్లీపర్ రైళ్ల ఉత్పత్తి పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫీల్డ్ ట్రయల్ రన్ నిర్వహించారు. దీన్ని యుపి నుంచి ఎంపి వరకు రెండు రోజుల పాటు నడిపారు. దీన్ని మధ్యప్రదేశ్‌లోని కజురహో నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వేస్టేషన్ వరకు నడిపారు.

  

టెక్నికల్ అంశాలు..

ఝాన్సీ రైల్వే బోర్డ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్‌కుమార్ సింగ్ తెలిపిన వివరాల మేరకు.. ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ శుక్రవారం మహోబాకు చేరుకుంది. మొదటి ఫీల్డ్ ట్రయల్ రన్‌లో భాగంగా రైలు వేగం నుంచి మెకానికల్, టెక్నికల్ అంశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించారు. అంతేకాదు ఈ ట్రైన్లో ‘‘కవచ్ రక్షణ వ్యవస్థ’’ కూడా పరీక్షించబడింది. ఈ స్లీపర్ వందే భారత్ ఎక్స్‌‌ప్రెస్ రైలులో SRDOతో పాటు, రైల్వే, టెక్నికల్ టీమ్, ICF చెన్నై టీమ్ కూడా రైలులో ఉన్నారు.

మహోబా నుంచి కజురహో వరకు..

శనివారం రోజున నిర్వహించిన ట్రయల్ రన్‌లో వందే భారత్‌ను 115 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఆదివారం రోజున దీని వేగాన్ని మరింత పెంచారు. ఈ స్లీపర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. మహోబా నుంచి కజురహో వరకు విజయవంతంగా ట్రయల్ రన్ ముగిసింది. అయితే భారతీయ రైల్వే ఢిల్లీ-ముంబై మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఈ మార్గంలో నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. ఈ రెండు నగరాల్లో ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిమాండ్ కూడా అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Post

కలలు ఆగలేదు… కష్టాల మధ్య సాయి లక్ష్మి సక్సెస్ జర్నీ

ఆగిపోయిన కెరీర్‌కు మళ్లీ శ్రీకారం.. గీత కొత్త ప్రయాణం

Sabarimala Special Trains అయ్యప్ప భక్తుల కోసం అదనపు రైళ్లు.. తెలుగు రాష్ట్రాల మీదుగా ఎన్ని రైళ్లంటే..

హైదరాబాద్ – గోవా టూర్ ప్యాకేజీ: విమాన ప్రయాణంతో IRCTC స్పెషల్ ఆఫర్!

ఎన్ని కోచ్‌లంటే..

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు, వందే భారత్ స్లీపర్ ట్రైన్లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 10 బోగీలు థర్డ్ ఏసీ, సెకండ్ ఎసీ 4 కోచ్‌లు, ఫస్ట్ ఏసీకి ఒక కోచ్ కేటాయించనున్నారు. వీటితో పాటు 2 సీటింగ్ కమ్ లగేజ్ కోచెస్ కూడా ఉంటాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైలు తొలి దశలో గంటలకు 130 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై పరుగులు పెట్టనుంది. అనంతరం క్రమం ఈ రైలు వేగాన్ని పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ రైలు గరిష్ట వేగం 160 నుంచి 220 కిలోమీటర్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

త్వరలో బుల్లెట్ రైలు..!

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు పెట్టకముందే బుల్లెట్ రైలు గురించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టు కూడా ఢిల్లీ-ముంబై నుంచే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర సమీపంలో ఢిల్లీ-ముంబై జాతీయ ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ వంతెనను నిర్మించారు.

Share214Tweet134SendSend

Related Posts

కలలు ఆగలేదు… కష్టాల మధ్య సాయి లక్ష్మి సక్సెస్ జర్నీ
ఆంధ్రప్రదేశ్

కలలు ఆగలేదు… కష్టాల మధ్య సాయి లక్ష్మి సక్సెస్ జర్నీ

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి చేసిన ప్రయత్నాల నుంచి AI క్రియేటర్‌గా కొత్త ప్రయాణం జీవితంలో ఎదురయ్యే ఓటములు మనిషిని ఆపగలవు. కానీ వాటిని దాటి...

by admin
September 3, 2026
ఆగిపోయిన కెరీర్‌కు మళ్లీ శ్రీకారం.. గీత కొత్త ప్రయాణం
టెక్నాలజీ

ఆగిపోయిన కెరీర్‌కు మళ్లీ శ్రీకారం.. గీత కొత్త ప్రయాణం

HDFC బ్యాంక్ ఉద్యోగం నుంచి కుటుంబ బాధ్యతల వరకు.. ఇప్పుడు AI, డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ సొంత బ్యూటీ బిజినెస్ దిశగా అడుగులు హైదరాబాద్: జీవితంలో కొన్ని...

by admin
September 4, 2026
Next Post
Sabarimala Special Trains అయ్యప్ప భక్తుల కోసం అదనపు రైళ్లు.. తెలుగు రాష్ట్రాల మీదుగా ఎన్ని రైళ్లంటే..

Sabarimala Special Trains అయ్యప్ప భక్తుల కోసం అదనపు రైళ్లు.. తెలుగు రాష్ట్రాల మీదుగా ఎన్ని రైళ్లంటే..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

AIతో కెరీర్‌కు కొత్త దిశ –  గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

September 18, 2026
AI నేర్చుకున్నాను  ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ

AI నేర్చుకున్నాను ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ

September 18, 2026
సూపర్ AI అకాడమీతో గృహిణి నుంచి AI క్రియేటర్‌గా సునీత కళ్యాణ్ విజయ ప్రయాణం

సూపర్ AI అకాడమీతో గృహిణి నుంచి AI క్రియేటర్‌గా సునీత కళ్యాణ్ విజయ ప్రయాణం

September 18, 2026
AI నైపుణ్యాలతో కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్న రోషిణి రెడ్డి

AI నైపుణ్యాలతో కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్న రోషిణి రెడ్డి

September 18, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us