• Contact Us
Monday, September 21, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. వారి నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం.. కోట్లకు కోట్లు!

Telugu World by Telugu World
March 20, 2025
in వ్యాపారం
Reading Time: 1 min read
0
PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. వారి నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం.. కోట్లకు కోట్లు!

PM Kisan 20th Installment: రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన గొప్ప పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6 వేలు ప్రభుత్వం అందిస్తుంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేస్తుంది. ఇక రూ. 6 వేలు ఒకేసారి రావు. దీనిని ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేల చొప్పున అందిస్తారు. ఇప్పటివరకు 19 విడతల్లో నిధులు అందించగా.. త్వరలో 20వ విడత నిధులు రానున్నాయి. అయితే ఈ క్రమంలోనే చాలా మంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని గుర్తించేందుకు కఠిన నిబంధనలు విధిస్తోంది. ఈ క్రమంలోనే అనర్హులుగా తేలిన వారి నుంచి డబ్బులు వెనక్కి కూడా తీసుకుంటోంది.

2019లో పథకం ప్రారంభం కాగా.. చాలా మంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బును తిరిగి రాబట్టాలని చూస్తోంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వీరందరి నుండి డబ్బును తిరిగి వసూలు చేస్తోంది. ఇప్పటివరకు ఇలా కేంద్రం.. రూ. 416 కోట్లను తిరిగి వసూలు చేసింది. ఈ మేరకు.. 2025, మార్చి 18న ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PIB) విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.

 
“అధిక ఆదాయ వర్గాల్లోని రైతుల నుంచి డబ్బును తిరిగి వసూలు చేయాలని రాష్ట్రాలు/UTలకు ఆదేశాలు జారీ చేశాము. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వారి నుంచి ఇప్పటివరకు రూ. 416 కోట్లు వసూలు చేశాం” అని PIB తెలిపింది.
ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బును నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి పంపిస్తారు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులకే డబ్బు అందుతుంది. 100 శాతం అర్హులకు ప్రయోజనాలు అందేలా.. అనర్హుల్ని గుర్తించేందుకు కేంద్రం ఇటీవల ప్రయత్నిస్తోంది. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన లబ్ధిదారు ఎప్పటికప్పుడు ఇ- కేవైసీ కచ్చితంగా చేసుకోవాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. భూ రికార్డులు కూడా సరిగా ఉండాలి. ఈ ప్రక్రియలతో మోసాల్ని అరికట్టవచ్చు.

PM-KISAN పథకానికి ఎవరు అనర్హులు?

Related Post

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

AI తెలుసుకోవడం కాదు, ప్రతిరోజూ ఉపయోగించడమే నిజమైన మార్పు” – నిఖిలు గుండా

వేగంగా నేర్చుకోండి, వేగంగా అమలు చేయండి – Mani Pavitra

  • భూమి కలిగిన సంస్థలు
  • రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు (మాజీ, ప్రస్తుత)
  • మంత్రులు, మేయర్లు, జిల్లా పంచాయతీ ఛైర్‌పర్సన్‌లు (మాజీ,ప్రస్తుత)
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
  • నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు (Multi Tasking Staff /Class IV/Group D ఉద్యోగులు మినహాయింపు)
  • గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు
  • డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు

కాబట్టి, ఈ వర్గాల ప్రజలు PM-KISAN పథకానికి అనర్హులు. ఒకవేళ మీరు పొరపాటున ఈ పథకం కింద డబ్బులు పొంది ఉంటే, వాటిని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి. స్వచ్ఛందంగా అనర్హులు.. తమ ప్రయోజనాలు వదులుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అర్హత ఉండి చేరని రైతులు.. దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తోంది. దగ్గర్లోని వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా పీఎం కిసాన్ వెబ్‌సైట్లోనూ చూడొచ్చు.

Share215Tweet134SendSend

Related Posts

AIతో కెరీర్‌కు కొత్త దిశ –  గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

హనుమకొండ, వరంగల్: కెరీర్‌లో ఒక దశలో వచ్చిన విరామం జీవితానికి ముగింపు కాదని, సరైన అవకాశం మరియు నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే ఎప్పుడైనా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని...

by admin
September 18, 2026
యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు
టెక్నాలజీ

యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

యూజర్ల ఆగ్రహంతో ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు-మెటా కీలక నిర్ణయం. సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన కొత్త ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ జనరేషన్...

by admin
July 11, 2026
Next Post
Mounjaro Cost: గుడ్‌న్యూస్.. ఊబకాయం, మధుమేహానికి భారత్‌లో తొలిసారిగా ఔషధం.. ధరెంతంటే?

Mounjaro Cost: గుడ్‌న్యూస్.. ఊబకాయం, మధుమేహానికి భారత్‌లో తొలిసారిగా ఔషధం.. ధరెంతంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

AIతో కెరీర్‌కు కొత్త దిశ –  గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

September 18, 2026
AI నేర్చుకున్నాను  ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ

AI నేర్చుకున్నాను ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ

September 18, 2026
సూపర్ AI అకాడమీతో గృహిణి నుంచి AI క్రియేటర్‌గా సునీత కళ్యాణ్ విజయ ప్రయాణం

సూపర్ AI అకాడమీతో గృహిణి నుంచి AI క్రియేటర్‌గా సునీత కళ్యాణ్ విజయ ప్రయాణం

September 18, 2026
AI నైపుణ్యాలతో కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్న రోషిణి రెడ్డి

AI నైపుణ్యాలతో కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్న రోషిణి రెడ్డి

September 18, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us