హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ మరియు వెల్నెస్ కోచ్ కల్వా సంజీవ్ కుమార్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని కల్వా సంజీవ్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
కల్వా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ
*”తెలుగు AI బూట్ క్యాంప్‌లో నేను ఊహించని అనేక విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా AI టూల్స్ వాడకం, వ్యాపార అభివృద్ధికి అనుగుణమైన వ్యూహాలు, నెట్వర్క్ బిల్డింగ్ వంటి అంశాలు ఎంతో ఉపయోగకరంగా అనిపించాయి.
ఈ క్యాంప్ ద్వారా వ్యాపార ప్రపంచంలో AI ఎంత ముఖ్యమైనది, మన వృత్తిపరమైన ఎదుగుదల కోసం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై స్పష్టత వచ్చింది. ఇంతకు ముందు కేవలం ఒక ఉద్యోగిగా ఆలోచించేవాణ్ని. కానీ ఇప్పుడు AI సాయంతో కొత్త వ్యాపార అవకాశాలు అన్వేషించగలనని బలమైన నమ్మకం కలిగింది.” అని అన్నారు