నల్గొండకు చెందిన వంగూరి నగేష్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని వంగూరి నగేష్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
వంగూరి నగేష్ మాట్లాడుతూ:
“AI ద్వారా విభిన్న రంగాల్లో అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. నేను ఈ బూట్ క్యాంప్‌లో AIతో కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్, బిజినెస్ ఆప్టిమైజేషన్ వంటి అంశాలను నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ మైండ్‌సెట్‌ను మార్చుకుని, నిరంతరం నేర్చుకుంటూ ఎదగాలి అనే భావన నాకు కలిగింది. మనకు మనమే కాంపిటీషన్, ఇతరులు కాదు. ఈ బూట్ క్యాంప్ ద్వారా నేను కొత్త ప్రాజెక్ట్స్‌పై పని చేయడానికి ప్రేరణ పొందాను” అని తెలిపారు.