ఆధునిక జీవనశైలి వ్యాధులకు, ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం చూపవచ్చని నిరూపిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు డా. పి. వి. వి. ప్రసాద్. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖలో 28 ఏళ్ల పాటు ఉన్నత సేవలు అందించి, దేశవ్యాప్తంగా ఆయుర్వేద పరిశోధనలో తనదైన ముద్ర వేసిన ఆయన, ప్రస్తుతం హైదరాబాద్, చందానగర్‌లోని “ఓజస్ క్లినిక్” ద్వారా ప్రజలకు తన అమూల్యమైన సేవలను అందిస్తున్నారు.
అపారమైన అనుభవం.. అసాధారణ ప్రతిభ.. BAMS, MD (ఆయుర్వేద), PhD (ఆయుర్వేద), డిప్లొమా ఇన్ యోగా వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన డా. ప్రసాద్ గారికి, ఆయుర్వేద రంగంలో 38 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ CCRASలో పనిచేస్తూ, దేశంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఆయుర్వేద పరిశోధనలకు నాయకత్వం వహించారు. 52కు పైగా పరిశోధన పత్రాలను, 6 పుస్తకాలను ప్రచురించడం ఆయన విజ్ఞానానికి నిదర్శనం. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) తెలుగు ఆయుర్వేద డాక్టర్ల సంఘం ‘అద్భుత’ (ABHUTA)కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ‘జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్’కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఆయన బహుముఖ సేవలు అందించారు.
ఆయుర్వేదం – జీవన విధానం ఈ సందర్భంగా డా. ప్రసాద్ గారు ఆయుర్వేదం ప్రాముఖ్యతను వివరిస్తూ… “ఆయుర్వేదం కేవలం వైద్య విధానం కాదు, అదొక సంపూర్ణ జీవన శాస్త్రం. వాత, పిత్త, కఫ అనే త్రిదోషాలను సమతుల్యం చేసుకోవడం ద్వారా, వ్యాధులను నివారించి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు,” అని పేర్కొన్నారు.
ఆయుర్వేద చికిత్సా విధానాలు: ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, మూలికా వైద్యం, పంచకర్మ, యోగా, ధ్యానం వంటి సహజమైన పద్ధతుల ద్వారా వ్యాధులను మూలాల నుంచి నయం చేయవచ్చని ఆయన తెలిపారు. ముఖ్యంగా పంచకర్మ, క్షారసూత్ర, అగ్నికర్మ, రసాయన చికిత్స వంటి ప్రత్యేక విధానాలతో దీర్ఘకాలిక వ్యాధులకు సైతం పరిష్కారం చూపవచ్చని వివరించారు.
“ప్రతి ఒక్కరూ ఆయుర్వేదాన్ని తమ జీవితశైలిగా మార్చుకొని, ఆరోగ్యంగా జీవించాలి. వ్యాధులు రాకుండా నివారించుకోవాలి, వచ్చిన వాటికి సహజ మార్గాల్లో చికిత్స పొందాలి,” అని డా. ప్రసాద్ పిలుపునిచ్చారు.
ఆయుర్వేద సలహాలు, చికిత్సల కోసం ఆయనను సంప్రదించవచ్చు.
డా. పి. వి. వి. ప్రసాద్ “ఓజస్ క్లినిక్”, చందానగర్, హైదరాబాద్ సంప్రదించండి: 9246551866 ఇ-మెయిల్: prasadpeyyala@yahoo.co.in