సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్ కు చెందిన గంపా ఆధిత్య భరత్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, బిఎన్ఎస్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని గంపా ఆధిత్య భరత్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా ఆధిత్య భరత్ మాట్లాడుతూ,
“తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా నేను నెక్స్ట్ లెవెల్ కెరీర్ క్లారిటీ పొందాను. AI టూల్స్‌ను వాడటం, ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలను మరింత పెంచుకోగలిగాను. ఇక నుంచి నా ప్రొఫెషన్లో ఈ టెక్నాలజీని సరికొత్త దిశగా వినియోగించాలని సంకల్పించాను. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది.