వరంగల్‌కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు గుడిపాక జయకర్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని గుడిపాక జయకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా గుడిపాక జయకర్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో మరియు ఆధునిక సా�ంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.
అభ్యుదయ 2026 ఘన ప్రారంభం: నూతన ఆరంభాలు, ఐక్యతతో ఉన్నత శిఖరాల వైపు విద్యార్థుల అడుగులు
మద్దూర్ రోడ్, నవంబర్ 21, 2026: విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ, ఉత్సాహం, ఆనందం, స్నేహబంధాల సమ్మేళనంగా ‘అభ్యుదయ 2026’ ఫ్రెషర్స్ వేడుక ఘనంగా...



