సమీక్ష ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడిగా రీసైకిల్ పేపర్ పెన్సిల్స్, పెన్నుల తయారీలో విజయవంతంగా రాణిస్తున్న చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ గుర్రం, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకుడు బాబూరావు, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు, ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రమోద్ కుమార్ గుర్రంకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ గుర్రం మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వ్యాపార, వృత్తి జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వ్యాపారంలో సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని ధీమాగా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తెలుగు AI బూట్ క్యాంప్ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, వ్యాపారవేత్తలు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు.
తెలుగు AI బూట్‌క్యాంప్ 2.0 జూలై 20 నుంచి ప్రారంభం – తెలుగు రాష్ట్రాల్లో AI నేర్చుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం
హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, AI నైపుణ్యాలను తెలుగులో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో...







