సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంకు చెందిన దుంపల నవీన్ కుమార్, స్లీపీ క్లౌడ్ మ్యాట్రిసెస్ వ్యవస్థాపకుడిగా విజయవంతంగా రాణిస్తున్నారు. ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని దుంపల నవీన్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వ్యాపార, వృత్తి జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వ్యాపారంలో సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని ధీమాగా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తెలుగు AI బూట్ క్యాంప్ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, వ్యాపారవేత్తలు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు.
కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం
హైదరాబాద్, మే 20, 2025: సాంప్రదాయ దారులు, డిగ్రీలు, స్థిరమైన ఉద్యోగాల వెంట పరుగెత్తే సమాజంలో, నవీన్ గోగు ఒక అసాధారణ శక్తిగా ఉద్భవించాడు. డిజిటల్ జీనీ...