ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ గతేడాది భారత జట్టుకి కాస్త తలనొప్పిగా మారాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ – ఏ మ్యాచ్ తీసుకున్నా, మన ఇండియాను గట్టిగా ఢీకొట్టాడు. అందుకే కొంతమంది భారత ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కానీ హెడ్ ఏమంటాడో తెలుసా? – “ఇవాళ అవి చూసినప్పుడు నాకు నవ్వొస్తుంది అంతే! నేను వాటిని సీరియస్‌గా తీసుకోను” అంటున్నాడు.

అయితే, ఇవి తనకు మరింత బలాన్నిస్తాయా అని అడిగితే… “కాదండీ! ఇవి ఎప్పటికీ నిరుత్సాహ పరచవు, బలాన్ని ఇవ్వవూ.. నేనెప్పుడు చేయాలనుకున్నదే చేస్తుంటాను – నా ఆటను నేను ఎప్పటికప్పుడు ఆస్వాదిస్తుంటాను అని చెప్పాడు!” అంటే ట్రోల్స్, కామెంట్లతో సంబంధం లేకుండా తన ఆట మీద ఫోకస్ పెడుతున్నాడు.
ఇప్పుడతను IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. “ఇండియా, ఆస్ట్రేలియా మధ్య పోటీ అంటే మజా ఉంటుంది. మేము బాగా ఆడుతాము వాళ్లూ మాపై గట్టిగానే ఆడతారు” అని ఓపెన్‌గా చెప్పారు. ఆ ఫైటింగే అసలైన క్రికెట్‌కి బ్యూటీ అంటున్నాడు హెడ్.