ఇండియాలో టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో మళ్లీ మరో కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇప్పటివరకు కాల్స్, డేటా, OTT ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న జియో, ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ సేవల్లోకి అడుగుపెట్టింది.
ఇప్పటినుంచి జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లందరికీ ప్రత్యేకంగా 50GB ఫ్రీ జియో ఆఐక్లౌడ్ (JioAIcloud) స్టోరేజ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని జియో యాప్ ద్వారానే యాక్సెస్ చేయవచ్చు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ లాంటి విలువైన డేటాను ఇప్పుడు సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు – అదీ పూర్తిగా ఉచితంగా!
జియో AI Cloud లో ప్రత్యేకతలు ఇవే:
- 50GB స్టోరేజ్ ఉచితం
- ఫైల్ షేరింగ్ సులువు
- యాక్సెస్ ఎవర్వేర్ (mobile, desktop)
- జియో యాప్‌లోనే డైరెక్ట్ యాక్సెస్
- ఫ్యామిలీ మెంబర్లతో డేటా షేర్ చేయొచ్చు
ఈ కొత్త ఆఫర్‌తో జియో ఇక ఆన్లైన్ స్టోరేజ్ రంగంలో కూడా తన ముద్ర వేసినట్టే. ఇప్పటికే గూగుల్ డ్రైవ్, ఆపిల్ ఐక్లౌడ్ వంటి సేవల మధ్య పోటీ ఉన్న సమయంలో, జియో స్టోరేజ్ సర్వీస్ కూడా దేశవ్యాప్తంగా జనాలకు సులభంగా ఉపయోగపడేలా కనిపిస్తోంది.
ఇంతకీ మీరు ట్రై చేశారా? జియో యాప్ ఓపెన్ చేసి, ‘JioCloud’ సెక్షన్లో చూడండి. మీ 50GB స్టోరేజ్ రెడీగా ఉంది!