ఖమ్మంకు చెందిన క్రిష్ణ చౌడవరపు ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకుడు బాబూరావు, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని చౌడవరపు క్రిష్ణకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వ్యాపార, వృత్తి జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వ్యాపారంలో సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని ధీమాగా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తెలుగు AI బూట్ క్యాంప్ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, వ్యాపారవేత్తలు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు.