టెక్నాలజీ రోజురోజుకూ కొత్త రూపాల్లో మన ముందుకు వస్తోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో సంచలనం సృష్టిస్తోంది క్రుతి ఏఐ (Kruti AI). ఇది సాదారణ ఏఐ టూల్ కాదు… ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ ఏజెంట్ ప్లాట్‌ఫామ్.

ఇది మనం ఇచ్చిన పనిని ఒకేచోట ఆగిపోకుండా, ఎన్నో దశల్లో స్వయంగా ఆలోచించి, వెబ్‌లో శోధించి, డేటాను విశ్లేషించి, పూర్తి సమాచారం ఇవ్వగలదు. ఒక రకంగా చెప్పాలంటే… ఇది మనకి ఓ ప్రత్యేకమైన స్మార్ట్ రిసెర్చర్ లాంటి వాడు!
ఎలా పనిచేస్తుంది?
- మీరు ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే చాలు.
- ఆ విషయానికి సంబంధించిన వెబ్ సైట్లు పరిశీలిస్తుంది.
- అవసరమైన డేటాను సేకరిస్తుంది.
- వివరాలను విశ్లేషించి స్పష్టమైన సమాధానాన్ని అందిస్తుంది.
ఉదాహరణకు:
- “భారతదేశంలో టాప్ 10 సాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు ఇవ్వండి” అని అడిగితే,
- తక్షణమే అన్ని వెబ్ సైట్లను పరిశీలించి, వారి సేవలు, ధరలు, కస్టమర్ రివ్యూస్ మొదలైన వివరాలతో ఓ పూర్తి రిపోర్ట్ అందిస్తుంది.
ఎవరికి ఉపయోగపడుతుంది?
- డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు
- వ్యాపారస్తులు
- పరిశోధకులు
- విద్యార్థులు
- స్టార్టప్ ఫౌండర్స్
- డేటా ఎనలిస్టులు
ఇంకా చెప్పాలంటే… మీరు చెబితే అది చేస్తుంది. అంతే!
ఫ్రీ వర్సెస్ పేడ్:
ప్రస్తుతానికి క్రుతి ఏఐ ఉచితంగా ప్రారంభించొచ్చు. చిన్న పనుల కోసం ఫ్రీ ప్లాన్ అందుబాటులో ఉంది. మరింత పెద్ద పెద్ద పనుల కోసం పేడ్ వెర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
భవిష్యత్తు ఏదైతే ఉండకూడదో, అదే కల్పిస్తున్నది క్రుతి ఏఐ.
ఇప్పటికే పలు రంగాల్లో దీని వినియోగం వేగంగా పెరుగుతోంది. ఆటోమేషన్ ద్వారానే సమయాన్ని, శ్రమను ఆదా చేసుకోవాలనుకునేవారికి ఇది అద్భుత పరిష్కారం.