సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ మద్దూరి గౌతమ్ ఇటీవల ప్రఖ్యాత AI నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మే 25, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడమీ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ యోగా నారాయణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మద్దూరి గౌతమ్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా మద్దూరి గౌతమ్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో కొత్త అవకాశాలను తెరిచింది. AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా పెరిగాయి. ఈ శిక్షణ నా ఫొటోగ్రఫీ వ్యాపారంలో సృజనాత్మక ఆవిష్కరణలు, మార్కెటింగ్ వ్యూహాలు, మరియు క్లయింట్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు. తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 9, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి 733 111 2687, 733 111 2686.