Canada: కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు.
59ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లైంది. మొత్తం లక్షా 50వేల పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నేకు లక్షా 31వేల 674 ఓట్లు వచ్చాయి.
ఇవి 85.9 శాతంతో సమానం. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ 11వేల 134, కరినా గౌల్డ్‌కు 4వేల 785, ఫ్రాంక్ బేలిస్‌కు 4వేల 38 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టనున్నారు.