• Contact Us
Thursday, November 26, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Ram charan: ‘నందమూరి’ థమన్‌ను రామ్‌ చరణ్‌ అన్‌ఫాలో చేశాడా?.. ‘గేమ్ ఛేంజర్’ గొడవపై క్లారిటీ

Teluguworld1 by Teluguworld1
March 20, 2025
in టాలీవుడ్
Reading Time: 1 min read
0
Ram charan: ‘నందమూరి’ థమన్‌ను రామ్‌ చరణ్‌ అన్‌ఫాలో చేశాడా?.. ‘గేమ్ ఛేంజర్’ గొడవపై క్లారిటీ

Related Post

రెండు దశాబ్దాల అనుభవం నుంచి AI ప్రపంచం వైపు.. రేఖ బి.జి. సరికొత్త ప్రయాణం

చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ

AI నేర్చుకున్న తర్వాత “నేను కూడా సాధించగలను” అనే నమ్మకం: ఉమ స్ఫూర్తిదాయక ప్రయాణం

సాధారణ జీవితం… అసాధారణమైన నేర్చుకునే తపన: ప్రశాంతి ప్రయాణం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతికి రిలీజైన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నిరాశ పరిచింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా థమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా సాంగ్స్ పై కీలక వ్యాఖ్యలు చేసాడు. పాటల్లో సరైన హుక్‌ స్టెప్‌ ఒక్కటి కూడా లేకపోవడం వల్లనే జనాల్లోకి వెళ్లలేదనే విధంగా మాట్లాడాడు. దీంతో థమన్ ను చరణ్ అన్‌ఫాలో చేసినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై చెర్రీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

థమన్‌ను రామ్‌ చరణ్‌ అన్‌ఫాలో అయ్యాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఎందుకంటే అసలు థమన్ ను చెర్రీ సోషల్ మీడియాలో ఫాలో అవ్వలేదని గ్లోబల్ స్టార్ టీమ్‌ ఓ ఇంగ్లిష్ మీడియాకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ మొదటి నుంచీ ఎక్స్, ఇన్‌స్టా గ్రామ్ రెండింట్లో చాలా తక్కువమందిని మాత్రమే ఫాలో అవుతున్నారని.. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారని.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను అన్‌ఫాలో చేశారనే వారాల్లో నిజం లేదని టీం స్పష్టం చేసింది. దీంతో ఈ రూమర్స్‌కు చెక్‌ పడినట్లయింది.


ఇటీవల థమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్స్ కు యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్‌ రాలేదని అన్నాడు. ఇదంతా కేవలం ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ వల్ల మాత్రమే కాదని నేనెప్పుడు నమ్ముతాను. నేను మిలియన్ల వ్యూస్ రాబట్టగలను కానీ, ఆ తర్వాత అవి రీల్స్‌లో క్లిక్ అవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ పాటలు అనుకున్నంతగా జనాలకు చేరలేదు. ఏ పాటలోనూ హుక్‌ స్టెప్‌ లేదు. దీంతో ఆడియన్స్‌కు పెద్దగా రీచ్‌ కాలేదు. పాటలో మంచి స్టెప్‌ ఉంటే ఆడియన్స్ దానికి కనెక్ట్‌ అవుతారు” అని కీలక కామెంట్స్ చేసాడు. అలానే ఓ షోలో ఓ అమ్మాయి ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని సాంగ్ కు పెరఫార్మ్ చేయగా.. సినిమాలో స్టెప్పుల కంటే బెటర్ గా ఉన్నాయనే కామెంట్స్ చేసాడు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ గురించి థమన్ చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మంచి పాటలు ఇవ్వకుండా ఇతరుల మీద నింద వేస్తున్నాడని, సాంగ్ ట్యూన్స్ అలా ఉన్నాయి కాబట్టే స్టెప్స్ కూడా అలానే కొరియోగ్రఫీ చేసాడని కామెంట్స్ చేస్తున్నారు. ‘నందమూరి థమన్’ అని పిలిపించుకుంటూ రామ్ చరణ్ సినిమాపై ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని అంటున్నారు. ఈ క్రమంలో చరణ్ సోషల్ మీడియాలో తమన్ ను అన్ ఫాలో చేసినట్లుగా రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదని చరణ్ టీమ్ స్పష్టం చేసింది.

Share214Tweet134SendSend

Related Posts

రెండు దశాబ్దాల అనుభవం నుంచి AI ప్రపంచం వైపు.. రేఖ బి.జి. సరికొత్త ప్రయాణం
అంతర్జాతీయ

రెండు దశాబ్దాల అనుభవం నుంచి AI ప్రపంచం వైపు.. రేఖ బి.జి. సరికొత్త ప్రయాణం

హైదరాబాద్: నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలనే తపన, తన అనుభవాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలనే ఆలోచనతో రేఖ బి.జి. తన వృత్తి ప్రయాణంలో మరో కొత్త...

by admin
September 28, 2026
చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ
టెక్నాలజీ

చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ

కుటుంబ బాధ్యతల మధ్య AI నేర్చుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అరుణ “ఏదో ఒకటి సాధించాలి... నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు...

by admin
September 28, 2026
Next Post
Chiranjeevi: యూకే పార్లమెంట్‌లో సత్కారం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Chiranjeevi: యూకే పార్లమెంట్‌లో సత్కారం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us