బీరంగూడ, హైదరాబాద్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్, మోటివేషనల్ స్పీకర్ & హ్యాపినెస్ కోచ్ అయిన రాయవరపు కాత్యాయని, ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న, T-Hub, హైదరాబాద్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వర్ రావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని రాయవరపు కాత్యాయని కి పట్టా అందజేశారు.
ఈ 21-రోజుల బూట్ క్యాంప్ లో AI టూల్స్, వ్యాపార అభివృద్ధి, క్రియేటివ్ డిజైన్, వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ వంటి అంశాల్లో లోతుగా శిక్షణ పొందారు.
AI బూట్ క్యాంప్ అనుభవాన్ని పంచుకుంటూ రాయవరపు కాత్యాయని మాట్లాడుతూ,
“ఈ కోర్సు నాకు ఊహించిన దానికంటే ఎక్కువ ఉపయోగపడింది. నేను నా పనిని వేగంగా & సులభంగా చేసుకునేందుకు AI నాకు ఎంతో సహాయపడింది. ముఖ్యంగా ChatGPT, Canva, KLiNGA, Spotify, Filmora లాంటి టూల్స్ ఉపయోగించి కంటెంట్ సేకరణ, PPT డిజైన్, క్రియేటివ్ వర్క్ వేగంగా చేయగలుగుతున్నాను. దాంతో పాటు, బిజినెస్ అభివృద్ధికి సంబంధించిన విలువైన సూచనలు కూడా అందించారు.” అని తెలిపారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది.