హైదరాబాద్ కు ప్రముఖ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ & బిజినెస్ ఎక్స్పర్ట్ అయిన శ్రీధర్ జల్ల, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని శ్రీధర్ జల్లకు పట్టా అందజేశారు.
ఈ కోర్సులో 21 రోజుల పాటు AI టూల్స్, వ్యాపార అభివృద్ధి, క్రియేటివ్ డిజైన్, వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ వంటి అంశాల్లో లోతుగా శిక్షణ పొందారు.
AI బూట్ క్యాంప్ గురించి శ్రీధర్ జల్ల మాట్లాడుతూ, “నేను ఊహించినదానికంటే ఎంతో ఎక్కువ నేర్చుకున్నాను. నా వృత్తి, వ్యాపారం, నిజజీవితంలో ఇవన్నీ చాలా ఉపయోగకరంగా మారాయి. ముఖ్యంగా AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించుకోవడం, నెట్వర్క్ బిల్డింగ్, స్కిల్స్‌ను వ్యాపారంగా మార్చుకునే పద్ధతులు తెలుసుకోవడం గొప్ప అనుభవం” అని తెలిపారు.
తదుపరి తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ మార్చి 15న ప్రారంభంకానుంది.