• Contact Us
Thursday, May 15, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

టీమిండియాకు రూ.58 కోట్లు.. అనౌన్స్ చేసిన బీసీసీఐ!

Telugu World by Telugu World
March 20, 2025
in క్రీడలు
Reading Time: 1 min read
0
టీమిండియాకు రూ.58 కోట్లు.. అనౌన్స్ చేసిన బీసీసీఐ!

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ రివార్డ్ ప్రకటించింది. ఐసీసీ నగదుతో పాటు బీసీసీఐ కూడా భారీ మొత్తంలో క్యాష్ రివార్డు ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియా స్క్వాడ్ మొత్తానికి రూ.58 కోట్లు ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఓటమి ఎరుగకుండా విజేతగా నిలిచింది.

 పాకిస్తాన్ వేదికగా ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ‌లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. పాకిస్తాన్-భారత్ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో టీమిండియా మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా సాగాయి. గ్రూప్ లీగ్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌ మీద గెలిచిన భారత్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఫైనల్స్‌లో న్యూజిలాండ్ మీద గెలిచిన భారత్ మూడోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది.

ఛాంపియన్స్‌గా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ ప్రత్యేకంగా రూ.58 కోట్ల నగదు అందజేయడం విశేషం. ఈ నగదు మొత్తం కేవలం 15 మంది టీమిండియా ప్లేయర్లే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్, కోచింగ్ స్టాఫ్ అందరికీ ఇవ్వనున్నారు. సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి కూడా ఈ నగదు రివార్డు అందించనున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ అందుకున్న తర్వాత విజేతలకు ఐసీసీ కూడా నగదు బహుమతి అందించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొత్తంగా రూ.60 కోట్ల ప్రైజ్‌మనీని ఐసీసీ కేటాయించింది. విజేతగా నిలిచిన టీమిండియాకు దాదాపు రూ.19.48 కోట్లు రాగా, రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.9.72 కోట్లు అందజేశారు. సెమీ ఫైనల్స్‌లో ఓడిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు చెరో రూ.4.86 కోట్లు అందుకున్నాయి.

Related Post

IPL 2025: నాయర్ సూపర్ షో, బుమ్రాతో ఘర్షణ, ఢిల్లీ ఓటమి – అరుణ్ జైట్లీలో డ్రామా!

చెపాక్‌లో ధోని ఫ్లాప్ షో: సెహ్వాగ్ చమత్కారంతో మ్యాచ్ టాక్ వైరల్!

IPL 2025: ధోనీ మళ్లీ CSK కెప్టెన్‌గా! ఫ్యాన్స్‌లో జోష్ రెట్టింపు

ఒక్క డాట్ బాల్‌కు ఎన్ని చెట్లు నాటుతారో తెలుసా? IPLలో గ్రీన్ రివల్యూషన్!

గ్రూప్ దశలో ఇంటిదారి పట్టిన జట్లకు కూడా వారి వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా నగదు అందజేశారు. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు రూ.3.04 కోట్లు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు రూ.1.22 కోట్లు అందజేశారు. గ్రూప్ స్టేజ్‌లో ప్రతి మ్యాచ్‌కు రూ.29 లక్షల చొప్పున నగదును ఐసీసీ అందజేసింది.

Share213Tweet133SendSend

Related Posts

IPL 2025: నాయర్ సూపర్ షో, బుమ్రాతో ఘర్షణ, ఢిల్లీ ఓటమి – అరుణ్ జైట్లీలో డ్రామా!
క్రీడలు

IPL 2025: నాయర్ సూపర్ షో, బుమ్రాతో ఘర్షణ, ఢిల్లీ ఓటమి – అరుణ్ జైట్లీలో డ్రామా!

ఏప్రిల్ 13, 2025 – ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఒక్కసారిగా రణరంగంగా మారింది! ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో...

by Telugu World
April 14, 2025
చెపాక్‌లో ధోని ఫ్లాప్ షో: సెహ్వాగ్ చమత్కారంతో మ్యాచ్ టాక్ వైరల్!
క్రీడలు

చెపాక్‌లో ధోని ఫ్లాప్ షో: సెహ్వాగ్ చమత్కారంతో మ్యాచ్ టాక్ వైరల్!

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఆసక్తికరంగా చర్చించిన ఒక వార్తాకథనం గురించి...

by Telugu World
April 12, 2025
Next Post
సోషల్ మీడియా పెట్టుబడిదారులది.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

సోషల్ మీడియా పెట్టుబడిదారులది.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

May 14, 2025
కతే పవన్ కుమార్ – సేవలో స్ఫూర్తి

కతే పవన్ కుమార్ – సేవలో స్ఫూర్తి

May 14, 2025
T-Hubలో భీమోజు ప్రశాంత్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో భీమోజు ప్రశాంత్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 13, 2025
T-Hubలో రమాకాంత్ వేములకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో రమాకాంత్ వేములకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 13, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.