హైదరాబాద్, బీరంగూడకు చెందిన వెల్నెస్ & లైఫ్ కోచ్ తోరం వెంకటేశ్వరరావు (TVRao), ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమం లో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, BNS శ్రీనివాస్ పాల్గొని తోరం వెంకటేశ్వరరావు కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
తోరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,
“తెలుగు AI బూట్ క్యాంప్ నాకు కెరీర్‌పై స్పష్టత కలిగించింది. AI టూల్స్‌ను నేర్చుకోవడం, వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా కొత్త అవగాహన పొందాను. ఈ బూట్ క్యాంప్ ద్వారా వృత్తి జీవితాన్ని కొత్త కోణంలో చూడగలిగాను. ఇప్పుడు నేర్చుకున్న టెక్నాలజీని నా ప్రొఫెషన్లో సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, మెంటర్ నికీలు గుండా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.