tock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లూ అదే ధోరణిలో కదలాడాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్ 73వేల దిగువకు చేరింది. స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ముందుగా ప్రకటించినట్లే చైనా, మెక్సికో, కెనడాపై టారిఫ్‌లను విధించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికి ప్రతిగా కొన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా సైతం సుంకాల విధించడం వాణిజ్య యుద్ధ భయాలకు ఆజ్యం పోసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 96 పాయింట్లు నష్టపోయి 72వేల989కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 22వేల82 వద్ద స్థిరపడింది.