రాజమండ్రికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సేల్స్ & మార్కెటింగ్ నిపుణుడు, కుమారి ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ తమ్మన నాగేశ్వర రావు, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ గారు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని తమ్మన నాగేశ్వర రావుకు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
తమ్మన నాగేశ్వర రావు మాట్లాడుతూ,
“ఈ తెలుగు AI బూట్ క్యాంప్ నాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో AI వాడకాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొద్దిపాటి సమయం మరియు తక్కువ ఖర్చుతో ఎంతో విలువైన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నాను.” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.