హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త తాడిపర్తి నాగార్జున ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని తాడిపర్తి నాగార్జునకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా తాడిపర్తి నాగార్జున మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వ్యాపార దృష్టికోణాన్ని సాంకేతికంగా సుసంపన్నం చేసింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగిస్తూ నా వ్యాపార నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వ్యాపారంలో నూతన ఆవిష్కరణలను ప్రవేశపెట్టడానికి మరియు సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేయడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది.
ప్రతి కుటుంబానికీ ఆర్థిక రక్షణే ధ్యేయం
ఎల్ఐసీ, స్టార్ హెల్త్ సేవలతో దైద మురళి భరోసా మిర్యాలగూడ, న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, ఆరోగ్య రక్షణ అత్యంత ఆవశ్యకమని,...