తిరుపతికి చెందిన వెల్నెస్ కోచ్ & లైఫ్ కోచ్ వసుధా భాస్కర్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, బిఎన్ఎస్ శ్రీనివాస్, అభిషేక్ పాల్గొని వసుధా భాస్కర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
వసుధా భాస్కర్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా నాలో కొత్త విశ్వాసం కలిగింది. నేను వెల్నెస్ కోచ్ & లైఫ్ కోచ్‌గా ముఖ్యంగా మహిళలకు మార్గదర్శనం చేస్తున్నాను. ఈ బూట్ క్యాంప్‌లో AI టూల్స్ గురించి నేర్చుకోవడం ద్వారా నా క్లయింట్లకు మరింత మెరుగైన సేవలను అందించగలనని విశ్వసిస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, మెంటర్ నికీలు గుండా కు హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.