వరంగల్‌కు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ విజయ్ జాక్కోజు, ప్రముఖ AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని విజయ్ జాక్కోజుకు పట్టా అందజేశారు.
విజయ్ జాక్కోజు మాట్లాడుతూ,
“22 రోజుల ఆన్లైన్ వర్క్‌షాప్‌లు, 2 ఆసక్తికరమైన ఆఫ్‌లైన్ సెషన్లతో ఈ AI బూట్ క్యాంప్ గొప్ప అనుభవాన్ని అందించింది. AI సాధనాలను అన్వేషించడంలోనే కాకుండా, నైతిక విలువలను కలిపి నేర్పిన తీరు ఎంతో నచ్చింది. ఈ శిక్షణ ద్వారా ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నాను. ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానాన్ని అమలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,” అని తెలిపారు.