కొమురం భీం అసీఫాబాద్ జిల్లాలోని గబ్బాయి గ్రామానికి చెందిన కుడ్మేత చెంచులక్ష్మి, మోటివేషనల్ స్పీకర్ మరియు కాన్వా ఎక్స్పర్ట్‌గా విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని కుడ్మేత చెంచులక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా కుడ్మేత చెంచులక్ష్మి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా మోటివేషనల్ స్పీకింగ్ మరియు కాన్వా డిజైన్ పనిలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
హరి ఉదాన్ 2026లో AI భవిష్యత్తుపై అవగాహన కల్పించిన సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండా
కర్నూలు: హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కర్నూలులో ఘనంగా నిర్వహించిన హరి ఉదాన్ 2026 – స్టేట్ మెరిట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన...







