గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆకాశం నుంచి మంటలు చిమ్ముతూ పడిపోయిన ఆ విమానం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు — ఆయనే విశ్వాస్ కుమార్ రమేష్!
ఈ విషాద ఘటనలో ప్రస్తుతం రమేష్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానం కూలిపోయిన తర్వాత వెనకాల పెద్దఎత్తున మంటలు, పొగలు ఉప్పొంగుతుండగా… తెల్లటి టీషర్టు ధరించిన రమేష్ నిశ్శబ్దంగా నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ అగ్నికుండం మధ్య నుంచి రమేష్ సజీవంగా బయటపడటాన్ని చూసిన ప్రతి ఒక్కరూ — “ఇది నిజమేనా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని గుర్తించిన స్థానికులు మొదట భయాందోళనకు లోనయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ సిబ్బందికి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో, మొబైల్ ఫోన్ పట్టుకుని రోడ్డుపైకి వస్తున్న తెల్లటి టీషర్టు ధరించిన వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. అతని శరీరంపై గాయాలు కనిపించడంతో వెంటనే అంబులెన్స్‌కు తరలించారు.
https://x.com/sam303T/status/1934525444168048696
ఈ ఘోర ప్రమాదం భవిష్యత్తులో ఎన్నడూ మరిచిపోలేని ఒక ఉదంతంగా మారిపోయింది. మరణాన్ని మట్టికరిపించి బయటపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడిగా నెట్టింట ఆరాధింపబడుతున్నాడు!