వనపర్తి జిల్లా రేవల్లి గ్రామానికి చెందిన దాది శివలీల, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని దాడి శివలీలకు పట్టా అందజేశారు..
దాది శివలీల మాట్లాడుతూ,
“AI ద్వారా పాటలు రూపొందించడం, వీడియో ఎడిటింగ్ చేయడం, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి అని తెలుసుకున్నాను. ఎప్పుడైనా మనకు మనమే కాంపిటీషన్, వేరే వాళ్లు కాదు అని గ్రహించాను. సంపాదన కోసం మన మైండ్‌సెట్ మార్చుకోవాలి, అలాగే పీపుల్ రిలేషన్షిప్ అనేది చాలా కీలకం. ఈ బూట్ క్యాంప్ ద్వారా నాకు తెలియని అనేక విషయాలు నేర్చుకున్నాను,” అని తెలిపారు.