జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్ మరియు రియల్ వర్సిటీ ఫౌండర్ ఇల్లూరు ఉరుకుందు శెట్టి, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మే 25, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడమీ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ యోగా నారాయణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా ఇల్లూరు ఉరుకుందు శెట్టి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్‌లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా మోటివేషనల్ స్పీకింగ్ మరియు ఎంట్రప్రెన్యూరియల్ కార్యకలాపాలలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో, రియల్ వర్సిటీ లక్ష్యాలను సాధించడంలో మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 9, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686.