ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కమ్యూనికేషన్ సాధనంగా నిలిచిన వాట్సాప్‌లో మరో కీలక మార్పు రాబోతోంది. త్వరలోనే యూజర్ల స్టేటస్‌ల మధ్య యాడ్స్ ప్రదర్శించనున్నారు. ఈ మేరకు వాట్సాప్ సంస్థ తాజా అప్‌డేట్‌ను ప్రకటించింది.
ఇప్పటి వరకూ యాడ్స్ లేకుండా వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చిన వాట్సాప్… ఆదాయ వనరులు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై స్టేటస్ మధ్యలో చిన్న చిన్న వీడియోలు, ఇమేజ్ యాడ్స్ కనిపించనున్నాయి. ఇదే తరహాలో వాట్సాప్ చానల్స్‌లో ప్రత్యేక కంటెంట్ అందుబాటులోకి రావడం కోసం సబ్‌స్క్రిప్షన్ విధానం కూడా ప్రవేశపెట్టనున్నారు.
ఈ మార్పుల వల్ల చిన్న వ్యాపారాలకు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే అవకాశం కలుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. ఇక యూజర్ల అభిప్రాయాలను గమనిస్తూ, యాడ్స్ ప్రదర్శనను మెరుగుపరచనున్నట్లు వాట్సాప్ తెలిపింది.