• Contact Us
Saturday, October 3, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

తప్పు జరిగింది.. సమాధానం ఇవ్వడం నా బాధ్యత: బెట్టింగ్ యాప్స్‌పై ప్రకాష్ రాజ్

Telugu World by Telugu World
March 20, 2025
in సినిమా
Reading Time: 1 min read
0
తప్పు జరిగింది.. సమాధానం ఇవ్వడం నా బాధ్యత: బెట్టింగ్ యాప్స్‌పై ప్రకాష్ రాజ్

ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. బెట్టింగ్ యాప్స్ వివాదంలో ముందుగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌, యూట్యూబర్స్ పేర్లు మాత్రమే వినిపించగా.. ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. ఇప్పటికే పలువురు సినీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేసారు. విష్ణు ప్రియ, రీతూ చౌదరి లాంటి కొందరిని విచారించారు. ఇక ఈ కేసులో సీనియర్‌ నటుడు ప్రకాష్ రాజ్‌ పేరు కూడా ఉంది. దీనిపై తాజాగా ప్రకాష్ రాజ్‌ స్పందిస్తూ ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసారు.

”నేను ఒక సినిమా షూటింగ్‌ లో ఉన్నాను. ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ కేసుల గురించి, నేను చేసిన బెట్టింగ్ యాప్ యాడ్‌ గురించి సోషల్ మీడియాలో, కొన్ని మీడియాలలో చర్చ జరుగుతోందని ఇప్పుడే నాకు తెలిసింది. అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి నోటీసులు, సమన్లు రాలేదు. ఒకవేళ వస్తే నేను వివరణ ఇస్తాను. అది నా రెస్పాన్సిబిలిటీ. నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే.. 2016 జూన్ లో జంగిల్ రమ్మీ గేమింగ్ యాప్ నా దగ్గరకు వచ్చింది. నేను ఆ యాడ్‌ లో నటించాను. అది లీగల్ అయినా సరే, కొన్ని నెలల తర్వాత అది సరైంది కాదని తెలుసుకున్నాను. కానీ ఏడాది కాట్రాక్ట్ కుదుర్చుకోవడం వల్ల నేను ఏమీ చేయలేకపోయాను”

 
”అగ్రిమెంట్‌ రెన్యూవల్ చేయడానికి వచ్చినప్పుడు నేను కుదరదని చెప్పేసాను. నేను కంటిన్యూ అవ్వలేనని చెప్పాను. ఇది జరిగి 9 ఏళ్లు అయింది. ఇప్పటి వరకూ నేను మళ్లీ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ని ప్రమోట్ చేస్తూ ఎలాంటి యాడ్ చేయలేదు. 2021లో ఆ కంపెనీ యాప్ ని ఇంకో కంపెనీకి అమ్మింది. వాళ్ళు నేను నటించిన యాడ్ ని ఏదో సోషల్‌ మీడియాలో పెట్టారు. నేను వాళ్ళకి నోటీసులు పంపించాను. కాంట్రాక్టు అయిపోయిన తర్వాత యాడ్ ఉపయోగించడం ఇల్లీగల్ అని, వెంటనే స్టాప్ చేయాలని మెయిల్ పెడితే.. వాళ్ళు ఆపేసారు”


”నేను అందరికీ చెబుతున్నాను.. ఎనిమిదేళ్ల క్రితం నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. గ్యాంబ్లింగ్ కి యువత బాధితులుగా మారొద్దని కోరుతున్నాను. ఎందుకంటే అవి జీవితాలను నాశనం చేస్తాయి. అందుకే అందరూ వాటికీ దూరంగా ఉండాలి. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి, ప్రజలకు ఈ సమాధానం చెబుతున్నాను. 8 ఏళ్ళ క్రితం నేను చేసిన ఒక్క తప్పుని మన్నిస్తారని ఆశిస్తున్నాను” అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
ఆన్‌లైన్ గేమ్స్‌పై విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ..
బెట్టింగ్ యాప్స్‌ కేసులో యువ హీరో విజయ్‌ దేవరకొండ పేరు కూడా రావడం, పోలీస్ కేసు ఫైల్ అవ్వడంపై ఆయన టీమ్‌ స్పందించింది. కేవలం స్కిల్‌ బేస్డ్‌ గేమ్స్‌కు మాత్రమే విజయ్ ప్రమోట్ చేసారని, అది కూడా కంపెనీ చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. రమ్మీ అనేది స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో సుప్రీం కోర్టు కూడా తెలియజేసింది. ఏ23 అనే కంపెనీతో విజయ్‌ అగ్రిమెంట్ గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మీడియాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన ప్రచారకర్తగా వ్యవహరించడం లేదు అని టీం క్లారిటీ ఇచ్చింది.

Related Post

13 ఏళ్ల కెరీర్ విరామం తర్వాత కొత్త ఆరంభం.. AI వైపు అడుగులు వేస్తున్న మాధవి యేలూరి

ఇంటి బాధ్యతల మధ్య ఆగని అభ్యాసం.. AI లెర్నర్‌గా కొత్త అవకాశాల వైపు వాసవి కొరంగి

భయాన్ని దాటి సృజన వైపు.. AIతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్న రామాదేవి

నిధి అగర్వాల్, ‘వీరమల్లు’ చిత్ర బృందానికి సీబీఎఫ్‌సీ సభ్యులు సుధాకర్ శుభాకాంక్షలు

Share214Tweet134SendSend

Related Posts

13 ఏళ్ల కెరీర్ విరామం తర్వాత కొత్త ఆరంభం.. AI వైపు అడుగులు వేస్తున్న మాధవి యేలూరి
టెక్నాలజీ

13 ఏళ్ల కెరీర్ విరామం తర్వాత కొత్త ఆరంభం.. AI వైపు అడుగులు వేస్తున్న మాధవి యేలూరి

హైదరాబాద్: కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంతో 13 ఏళ్ల పాటు తన కెరీర్‌కు దూరంగా ఉన్నప్పటికీ, తనలోని కలలను మాత్రం వదులుకోలేదు మాధవి యేలూరి. మధ్యతరగతి కుటుంబం...

by admin
September 4, 2026
ఇంటి బాధ్యతల మధ్య ఆగని అభ్యాసం.. AI లెర్నర్‌గా కొత్త అవకాశాల వైపు వాసవి కొరంగి
టెక్నాలజీ

ఇంటి బాధ్యతల మధ్య ఆగని అభ్యాసం.. AI లెర్నర్‌గా కొత్త అవకాశాల వైపు వాసవి కొరంగి

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాసవి కొరంగి జీవితంలో కుటుంబ బాధ్యతలు ఒక ముఖ్యమైన అధ్యాయంగా మారాయి. వివాహం అనంతరం డిగ్రీ విద్యను పూర్తి చేసి కుటుంబాన్ని...

by admin
September 29, 2026
Next Post
Ram charan: ‘నందమూరి’ థమన్‌ను రామ్‌ చరణ్‌ అన్‌ఫాలో చేశాడా?.. ‘గేమ్ ఛేంజర్’ గొడవపై క్లారిటీ

Ram charan: 'నందమూరి' థమన్‌ను రామ్‌ చరణ్‌ అన్‌ఫాలో చేశాడా?.. 'గేమ్ ఛేంజర్' గొడవపై క్లారిటీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

OpenAI Dots AI Agents

OpenAI తీసుకొచ్చిన కొత్త AI ఏజెంట్లు ‘Dots’.. ఇక మీ పనులన్నీ 24/7 చేసే స్మార్ట్ అసిస్టెంట్లు!

October 1, 2026
AI నేర్చుకుని.. ఇంటి నుంచే సంపాదన:  లలిత స్ఫూర్తిదాయక ప్రయాణం

AI నేర్చుకుని.. ఇంటి నుంచే సంపాదన: లలిత స్ఫూర్తిదాయక ప్రయాణం

September 30, 2026
నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు  నాగవరలక్ష్మి అడుగులు

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు నాగవరలక్ష్మి అడుగులు

September 28, 2026
తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

September 28, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us