హైదరాబాద్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని, Ozone Run & Foodiet వ్యవస్థాపకురాలు తీర్థ వున్నం, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు, ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని తీర్థ వున్నంకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా తీర్థ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా విద్యా మరియు వృత్తి జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ భవిష్యత్తులో నా చదువులో, కెరీర్‌లో, మరియు నా వ్యాపార సంస్థ అభివృద్ధిలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన నికీలు గుండ సర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తెలుగు AI బూట్ క్యాంప్ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు, మరియు ఔత్సాహిక వ్యవస్థాపకులు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు.
OpenAI Enters Hardware with Codex Micro AI Keyboard for Developers
OpenAI నుంచి First Hardware Launch.. Developers కోసం Codex Micro AI Keyboard విడుదల.! Meta Description OpenAI తన First Branded Hardware అయిన...







